భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. భారత్‌లో 24 గంటల్లో 19,148 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 6,04,641కి చేరింది. కాగా కరోనాతో 24 గంటల్లో 434 మంది మృతి చెందగా దేశంలో మొత్తం మరణాల సంఖ్య 17,834కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకొన్న వారి సంఖ్య 3,59,859గా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,26,947 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

ట్విస్ట్ ఏంటంటే ఈ రోజుతోనే దేశంలో లాక్‌డౌన్ పెట్టి వంద రోజులు అయ్యింది. ఈ రోజు దేశంలో కేసులు కూడా ఆరు ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఈ కేసుల లిస్ట్ చూస్తుంటే యావ‌త్ భార‌తావ‌ని బెంబేలెత్తిపోతోంది. 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 2,29,588 టెస్టులు చేయ‌గా.. మొత్తం టెస్టుల సంఖ్య‌90,56,173కి చేరింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ముందువరుసలో ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: