ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,097కి చేరింది. తాజాగా 281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తమ్మీద రాష్ట్రంలో 7,313 మంది డిశ్చార్జి కాగా, 6,673 మంది ఆసుపత్రులలో, 1,913 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.

 

ఇక, గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 198కి పెరిగింది. తాజాగా కాకినాడ జిజిహెచ్ లో కరోనా కలకలం రేగింది.  నలుగురు వైద్యులు, ఇద్దరు వైద్య విద్యార్థులకు  కరోనా పాజిటివ్ అని తేలింది. జీజీహెచ్ విధుల్లో ఉన్న వైద్యులకు  కరోనా సోకడంతో  ఆందోళన. 


ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత  వైద్యులు. విశాఖ విమ్స్ కీ గాని రాజమండ్రి జిఎస్ఎల్ ఆసుపత్రి కి గాని తరలించే ఆలోచనలో అధికారులు.  30 మంది వరకు  ప్రైమరీ కాంట్రాక్టును గుర్తించినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: