ఈ మద్య ఏపిలో కరోనా పాజిటీవ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, గన్ మెన్, డ్రైవర్ ఇలా పలువురుకి కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఓ వైపు కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యే లు కరోనా భారిన పడి చికిత్స పొందుతున్నారు. 

 

తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ గన్‌మెన్‌, ఫొటోగ్రాఫర్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనకు కూడా పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ లో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లోనే ఉంటున్నారు. ప్రస్తుతం అధికారులు అప్రమత్తమైన పూర్తిగా శానిటైజర్ చేస్తున్నారు.

 

ఇక డ్రైవర్ కు కరోనా రావటంతో ప్రస్తుతం భరత్ రామ్ తానే స్వయంగా  కారు డ్రైవ్ చేసుకుంటూ,  గన్ మెన్ లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు  హాజరవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: