ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం కోర్ట్ వ్యవహారాలపై తన మార్క్ లో కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. తిరుమల పర్యటనకు వెళ్ళిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో రాజకీయ వికృత చేష్టలు పరాకాష్టకు చేరడంతో.. పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని ఆయన విమర్శలు చేసారు. ఏపీలో గతంలో ఎన్నడూలేని వింత పరిస్థితులు నెలకొన్నాయని స్పీకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

 

ద్రవ్య బిల్లును ఆపి ఉద్యోగుల జీతాలను కూడా అడ్డుకున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పని చేయాలని ఆయన సూచించారు. అందుకే కోర్టు తీర్పులను గౌరవిస్తున్నామని స్పీకర్‌ తాజాగా వ్యాఖ్యలు చేసారు. కాగా టీడీపీ శాసన మండలిలో ద్రవ్య బిల్లుని అడ్డుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: