భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు అమెరికా బలగాలను భారత్ తిరస్కరిస్తుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అమెరికా విదేశాంగ శాఖా మంత్రి ఇటీవల దీనిపై ఒక ప్రకటన చేసారు. అయితే భారత్ మాత్రం చైనా విషయంలో అమెరికా సాయం వద్దు అని అనవసరంగా రిస్క్ అని భావిస్తుంది. ఒక్కసారి అమెరికా సైనికులు వస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని  భారత్ భావిస్తుంది. 

 

త్వరలో జరిగే కేబినేట్ సమావేశంలో అమెరికా సాయం విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. అమెరికా ముందుకు వచ్చినా సరే వద్దు అని చెప్పడమే మంచిది అనే భావన లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. కాగా రక్షణ శాఖా మంత్రి రాజనాథ్  రేపు లడఖ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: