తెలంగాణా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా సర్కార్ ఉచితంగా సరఫరా చేస్తున్న చేప పిల్లల కొనుగోళ్ల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన అధికారులను ఆదేశించారు. 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలు, వలలు, కేట్స్‌ పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో మత్స్యశాఖకు ఎంతో గుర్తింపు వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యశాఖకు నిధులు కేటాయింపు నామమాత్రంగా ఉండేదని ఆయన ఆరోపించారు.  ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్‌ చొరవతో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: