ఉత్తరప్రదేశ్ లో కరోనా అదుపులో ఉంది అని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా సరే అది నిజం కాదని తెలుస్తుంది. అక్కడ ప్రతీ రోజు కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పుడు చర్యలు తీసుకున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

గత 24 గంటల్లో రాష్ట్రంలో 817 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6869 క్రియాశీల కేసులు ఉన్నాయి, ఇప్పటివరకు 17,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 735 మంది  కరోనాతో ప్రాణాలు కోల్పోయారు అని ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (ఆరోగ్య) అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: