వైరస్ లకు చైనా పుట్టిల్లు అవుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ నానా ఇబ్బందులు పెడుతుంది ప్రపంచాన్ని. ఈ తరుణంలో మరో వైరస్ ఇప్పుడు ప్రపంచం మీద దాడి చేయడానికి సిద్దమవుతుంది అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో పుట్టిన జీ 4 అనే వైరస్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచం మొత్తం  భయపడుతుంది. 

 

ఆ దేశంలో ఈ వైరస్ 4.4 శాతం మందికి సోకింది అనే వార్తలు కాస్త ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అయితే ఈ వైరస్ ఏమీ ప్రపంచానికి కొత్తది కాదని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదిలా ఉంటే... చైనా నుంచి వచ్చే అన్ని విమానాలను ఆపేయడం మంచిది అనే వ్యాఖ్యలు  ప్రపంచ దేశాల నుంచి వినపడుతున్నాయి. ఆ వైరస్ వస్తే ఇక నాశనమే అని భావిస్తున్నాయి పలు దేశాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: