ఒక పక్క కరోన వైరస్ తో నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో చైనా నుంచి మరో వైరస్ దాడి చేసే అవకాశం ఉంది అనే వార్తలు  ఇప్పుడు ప్రజలను మరింత కంగారు పెడుతున్నాయి. చైనాలో మరో స్వైన్‌ఫ్లూ ఇప్పుడు ప్రపంచంపై యుద్ధం చేయడానికి రెడీ గా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కొత్త స్వైన్‌ ఫ్లూ వైరస్‌గా చెబుతున్న ఈ జీ4 వైరస్‌ను 2011 నుంచీ తమ సంస్థ గమనిస్తోందని పేర్కొంది. 2011 నుంచి 2018 వరకూ ఈ వైరస్‌పై అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విస్లేశిస్తున్నామని  ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ మైక్ రాయన్ పేర్కొన్నారు. ఇది కొత్తది ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: