ఆంధ్రప్రదేశ్ లో కాపు ఉద్యమం మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కాపులకు ఏపీ సర్కార్ చెప్పిన సహాయం చేయడం లేదు అనే విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ సీఎం జగన్‌కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాసి అందులో కాస్త తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

 

పాలకులు ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు ఎందుకు ముందుకు రావట్లేదని ముద్రగడ సిఎం జగన్ ను లేఖలో ప్రశ్నించారు. మా జాతి సమస్య తీర్చమని ప్రధాని మోదీని కోరాలని ఆయన పేర్కొన్నారు. నవీన్‌ పట్నాయక్‌, జ్యోతిబసు, వైఎస్‌లా పూజలందుకోవాలే గానీ మీ పదవిని మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దని సిఎం జగన్ కు ఆయన హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: