హోం ఐసోలేషన్ లో ఉండే వారికి కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రోగులు ఎప్పుడు కూడా ట్రిపుల్ లేయర్ మాస్క్ వాడాలి అని సూచించింది. మాస్క్ 8 గంటల కంటే ఎక్కువ వాడితే మాత్రం వేడి నీళ్ళల్లో ఉతకాలి అని స్పష్టం చేసింది. వృద్దులు మరియు బీపీ హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారు ఇతర వ్యాధులు ఉన్న వారు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని చెప్పింది. 

 

వారు ప్రతి రోజు కూడా ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంది. వ్యక్తిగత వస్తువులను ఇతర వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు అని చెప్పింది. చేతులను కనీసం 40 సెకన్ల పాటు కడుక్కోవడం మంచిది అని చెప్పింది. రోగి తప్పనిసరిగా వైద్యులు  సూచించిన మందులనే వాడాలి అని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: