అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అవుట్ సోర్సింగ్ సర్వీసుల కార్పోరేషన్ ని ప్రారంభించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎవరికి లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు రావాలని అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే కేటాయిస్తున్నామని అన్నారు. 

 

గతంలో ఉద్యోగాలు జీతాల కోసం  లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేది అని అన్నారు. 50 వేల 449 మందికి ఏపీ సర్కార్ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం 50 శాతం రిజర్వేషన్ ని అమలు చేస్తున్నారు. ఈ కార్పోరేషన్ లో రెండు కేంద్రాలు ఉంటాయని సిఎం జగన్ ఈ సందర్భంగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: