దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లాక్ డౌన్ దేవాలయాలు మూతబడగా గత నెల 8 నుంచి దర్శనాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ 1.0తో తిరిగి శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అయితే తాజాగా టీటీడీ సిబ్బందికి, అర్చకుడికి కరోనా సోకింది. దీంతో రేపు టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరపనుంది. 
 
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు, ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు ప్రబలకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పాలకవర్గం రేపు భేటీ కానుంది. రోజురోజుకు కరోనా కేసులు కూడా పెరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించనున్నట్లు సమాచారం. . శ్రీవారి దర్శన విధి విధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: