తెలంగాణ హైకోర్టులో నేడు ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌ గురించి వాదనలు జరిగాయి. అడ్వకేట్ జనరల్ విద్యాసంవత్సరం ప్రారంభించలేదని... కేబినేట్ భేటీలో కేబినేట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పగా హైకోర్టు సీరియస్ అయింది. ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని... ఇలా చేస్తే ఆర్థికంగా వెనుకబడిన వారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యలు చేసింది. 
 
ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఈనెల 13న నిర్దిష్ట ప్రణాళిక కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసిందని, ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆన్ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతునే... మరోవైపు ఆన్ లైన్ క్లాసులను అడ్డుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: