ఆంధ్రప్రదేశ్ లో మిలియన్ కి 18 వేల 200 పరిక్షలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అన్నారు. దేశంలో రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. కరోనా పరిక్షల సంఖ్యను పెంచామని ఆయన చెప్పారు.  అన్ లాక్ దశ ప్రారంభం అయిన తర్వాతే కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.

 

ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 లక్షల 70 వేల కరోనా పరిక్షలు చేసామని ఆయన చెప్పుకొచ్చారు. వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనే దానిని పరిశీలిస్తున్నామని అన్నారు. పరిక్షల సంఖ్యను ఇంకా పెంచుతామని ఆయన చెప్పుకొచ్చారు. కూరగాయల మార్కెట్ లో పండ్ల మార్కెట్ లో పరీక్షలను చేస్తామని ఆయన అన్నారు. నిర్మాణ రంగం వ్యవసాయ కూలీలకు కూడా పరిక్షలు చేస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: