అంగారకుడికి దగ్గరలో ఉన్న అతిపెద్ద చంద్రుడి ఫొటోనూ చిత్రీకరించింది ఇస్రో ప్రయోగించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌(మామ్​). జులై 1న ఈ ఫొటోను తీసింది. 

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్)‌లోని కలర్‌ కెమెరా....అంగారకుడికి దగ్గరలో ఉన్న అతిపెద్ద చంద్రుడైన ఫోబోస్‌ను చిత్రీకరించింది. అంగారకుడికి 7వేల 200 కిలోమీటర్లు, ఫోబోస్‌కు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు జులై 1న ఈ ఫొటోను తీసింది. 
ఫోబోస్‌ ఎక్కువగా కార్బోనాసియస్‌ కోన్‌డ్రైట్స్‌తో తయారు అవుతుందని ఇస్రో తెలిపింది. ఫోబోస్‌లోని అతిపెద్ద బిలం స్టిక్నీని కూడా ఇస్రో ఈ చిత్రంలో మార్క్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: