టీడీపీ  నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఆయనను అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసారు అని బీసీ నేతలను పట్టుకుని నానా రకాల బాధలు పెడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. తాజాగా ఆయన అరెస్ట్ పై మరో మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. 

 

రాజకీయకక్షతో తెలుగుదేశం పార్టీ  నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రాథమిక విచారణ కూడా లేకుండా మాజీ మంత్రి  కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని దేవినేని ఉమా ఆరోపించారు. నిన్న వైజాగ్ వెళ్తూ ఉండగా రవీంద్రను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: