ప్రపంచం మొత్తం కరోనాతో నానా కష్టాలు పడుతున్నారు. భారతీయులు ఇతర దేశాల్లో చిక్కుకొని విల విలలాడిపోయారు. ఈ నేపథ్యంలో వందే భారత్ మిషన్ ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది కేటుగా ఇంత మంచి పనిలో కూడా తమ చేతి వాటం చూపిస్తున్నారు. ఢిల్లీ‌ దుబాయ్ నుంచి జైపుర్కు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న స్మగ్లర్ల ముఠాను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి దాదాపు 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లోని రాజస్థాన్ వలసదారులను తిరిగి జైపుర్కు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టింది.

 

ఇదే అదునుగా స్మగ్లర్లు దుబాయ్ నుంచి జైపుర్కు వచ్చిన విమానంలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించి... కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. 14 మంది స్మగ్లర్లు దుబాయ్ నుంచి జైపుర్కు మూడు విమానాల్లో వచ్చారు. అయితే వీరంతా కలిసి దాదాపు రూ.16 కోట్లు విలువైన 32 కేజీల బంగారాన్ని అక్రమంగా భారత్కు తరలించాలని చూశారు.

 

పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తు‌న్నా‌రు. ఒక మంచి పనికోసం భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని కూడా ఇలా బ్రస్టు పట్టిస్తున్న ఈ స్మగ్లర్లపై తీవ్రమైన చర్య తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: