తెలంగాణ‌లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.  నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ కేసులు ఏకంగా 8 రెట్లు పెరిగిపోయాయి. మే నెలలో 1,659 కేసులు నమోదవ్వగా ఒక్క జూన్‌లోనే  13,641 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ తేడాను గ‌మ‌నిస్తే నెల రోజుల వ్య‌వ‌ధిలో ఏకంగా 8 రెట్లు క‌రోనా రోగులు పెరిగిపోయారు. ఇక ప్ర‌స్తుతం అక్క‌డ నిర్వ‌హిస్తున్న‌ట్ట ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే జూలై నెలాఖ‌రు నాటికి కేసులు ఏకంగా 60 వేలు దాటుతాయ‌ని.. ఒక్క హైద‌రాబాద్‌లోనే ఇవి ఏకంగా 45 వేలు దాటుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

 

అయితే ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం 14 వేలు ఉంది. ఈ స్థాయిలోనే జూలై నెలాఖ‌రు వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే కేసులు ఈ కేసులు ల‌క్ష దాటిపోతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రో టాక్ ప్ర‌కారం వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌తి రోజు విడుద‌ల చేస్తోన్న లెక్క‌ల‌కు.. వాస్త‌వ లెక్క‌ల‌కు చాలా తేడా ఉంటుంద‌ని కూడా కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి కూడా క‌లిపితే ఇక్క‌డ కేసులు చాలా ఎక్కువ అవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: