గర్భిణికి కరోనా వస్తే ఆమె బిడ్డకు కూడా కోరనా వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. అయితే  జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి అవకాశం ఉండదు అని వైద్యులు చెప్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే రాదు అని వైద్యులు చెప్పడం, కొన్ని చోట్ల అది నిజం కావడం కూడా మనం చూస్తున్నాం. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి ఆపరేషన్  ఒకటి విజయవంతంగా చేసారు. రాజస్థాన్‌లోని భిల్వారాలో గ‌ల‌ మహాత్మా గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన మహిళకు సిజేరియన్ చేసిన వైద్యులు పుట్టిన బిడ్డకు కరోనా రాకుండా జాగ్రతలు తీసుకున్నారు.ఐసోలేషన్ వార్డులో ఉంచి సిజేరియన్ చేసారు. బిడ్డకు కరోనా పరిక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది అని వైద్యులు వెల్లడించారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను అధికారులు అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: