అగ్ర రాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా వింధ్వసం మొదలైంది. నిన్నమొన్నటి వరకు అమెరికాను అతలాకుతలం చేసిన మహమ్మారి ఆ త‌ర్వాత కొద్దిగా శాంతిచిన‌ట్లు ఉన్నా మ‌ళ్లీ ఒక్క‌సారిగా విజృంభించింది. ఇప్పుడు ఏకంగా రోజుకు 50 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 40 రాష్ట్రాలు క‌రోనాతో విల‌విల్లాడుతున్నాయి.

 

నిన్న న‌మోదు అయిన 55 వేల కేసుల్లో 25 వేలు ఆరిజోనా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.10 కోట్ల మంది కరోనా బాధితులుగా మారగా, ఇప్పటి వరకు 5.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే అమెరికాలో త్వ‌ర‌లో రోజుకు ల‌క్ష కేసులు న‌మోదు అవుతాయ‌ని అంత‌ర్జాతీయ నిపుణులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: