వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను నేడు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు జరగగా కోర్టు కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. శుక్రవారం రాత్రి వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఉందని తేలడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 
 
తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో ఆయన పోలీసులకు చిక్కారు. జూన్ 29వ తేదీన హత్య జరిగిన తరువాత మోకా కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు అనుమానితుల జాబితాలో కొల్లు రవీంద్ర పేరు ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: