వరద సమయాల్లో సాహసాలు చేయొద్దని  ఎన్నిసార్లు చెప్పినా.. కొంత మంది పెడచెడిన పెట్టి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో  ఓ ద్విచక్రవాహనదారుడు చెబుతున్నా వినకుండా కల్వర్టు మీదుగా వరద వస్తున్నా దాటించబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.  ఇక లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.

 

దాంతో బ్రిడ్జీలు, కల్వర్టుల మీదుగా వరద ప్రవహిస్తున్నది. రోడ్ల మీదకు సైతం వరద వచ్చి ఇండ్లలోకి చేరుతోంది. అక్కడ ప్రమాద సూచిక ఉందని.. వరద బాగా వస్తుందని తెలిసి కూడా ఓ ద్విచక్రవాహనదారుడు దాటించే ప్రయత్నం చేశాడు. నీటి వేగానికి బైక్‌ అదుపు తప్పడంతో వాహనంతో సహా వరదలో కొట్టుకుపోయాడు. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని కాపాడారు. ఇలాంటి సమయంలో ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకొవడం ఎంతో పొరపాటు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: