తెలంగాణాలో ప్రైవేట్ ల్యాబుల పని తీరు నేపధ్యంలో ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణాలోని 23 ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా పరిక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిల్లో శానిటేషన్ లేదు అని అదే విధంగా పరిక్షల ఫలితాలు సరిగా రావడం లేదు అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. 

 

ఈ నేపధ్యంలోనే తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. 13 ల్యాబులకు తాము నోటీసులు ఇచ్చామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రైవేట్ ల్యాబులు తప్పులు సరిదిద్దుకోలేదు అంటే మాత్రం కచ్చితంగా మూసి వేస్తామని హెచ్చరించింది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ధరల విషయంలో కూడావార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: