దేశంలో ఇటీవల లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శంలో క‌రోనా కేసుల సంఖ్య ప్ర‌తి రోజు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతుంది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 22,771కేసులు న‌మోదుకాగా, 442మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దేశంలో ప్ర‌స్తుతం 6,48,315కేసులుండ‌గా, మ‌ర‌ణాల సంఖ్య 18,655కు చేరింది.దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 2,35,433 ఉండ‌గా, క‌రోనా నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 3,94,227మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో క‌రోనా నుండి కోలుకుంటున్న‌వారి సంఖ్య 60.81గా ఉంది.

 

ఇక కరోనా కట్టడి చేయడానికి వివిధ రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో క‌ట‌క్‌లో పూర్తిగా ష‌ట్‌డౌన్ విధించింది. జూలై 8 వ‌ర‌కు ఈ ష‌ట్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టంచేసింది. ఈ మేర‌కు ఒడిశా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఉటంకిస్తూ క‌ట‌క్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

 

కంప్లీట్ ష‌ట్‌డౌన్ నేప‌థ్యంలో క‌ట‌క్‌లో నిబంధ‌న‌లను క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు, పాలకు సంబంధించిన దుకాణాలు ఉద‌యం 5 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంటాయ‌ని తెలిపారు. కాగా క‌ట‌క్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 116 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో 92 యాక్టివ్ కేసులు ఉన్నాయి

 

మరింత సమాచారం తెలుసుకోండి: