ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 104, 108 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున వీటిని సిఎం వైఎస్ జగన్ ఇటీవల విజయవాడ కేంద్రంగా ప్రారంభించారు. దీనిపై దేశ వ్యాప్తంగా కూడా ప్రసంశలు వస్తున్నాయి. అయితే దీనిపై బిజెపి కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 70 శాతం నిధులు ఇస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అన్నారు. 

 

వాహనాలకు కేవలం రాజశేఖర్ రెడ్డి బొమ్మలు వేసి సీఎం జగన్ ప్రారంభించడం దారుణమని ఆయన మండిపడ్డారు. 70 శాతం నిధులిస్తున్న ప్రధాని ఫోటో ‌‌లేకపోవడం దుర్మార్గమని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. అదే విధంగా గాల్పన్‌లో ఉద్రిక్తత పరిస్థితిని లెక్క చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లి సైనికుల్లో మనోనిబ్బరం నింపారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: