దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని మూడు నెలల క్రితం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో జనసందోహంగా ఉన్న అన్ని వ్యవస్థలు మూసివేశారు. ఇందులో దేవాలయాలు కూడా ఉన్నాయి.  ఈ మద్యనే దేవాలయాలు పునఃప్రారంభించారు.  ఈ నేపథ్యంలో వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఈ రోజు శాకాంబరిగా దర్శనమిచ్చారు. 200 కిలోల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.

 

కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.  65 ఏండ్లు దాటిన వృద్ధులు, 10 ఏండ్లలోపు పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. పదిహేను రోజులక్రితం ప్రారంభమైన ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. భక్తులు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని ధర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నాట్లు దేవాలయ అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: