దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. సర్దార్ పటేల్ కోవిడ్  సెంటర్ గా పిలుస్తున్న దీన్ని ఈరోజు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్  ప్రారంభించారు. పదివేల పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా...నోడల్  ఏజెన్సీగా ఆసుపత్రిని ఐటీబీపీ నిర్వహిస్తోంది. 

 


 ఇక రాధా సోమీ బియాస్ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన కొంత మంది స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయగా  20 ఫుట్బాల్ మైదానాలకు సమానంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంత లక్షణాలు అసలు లక్షణాలు లేని వారికి కూడా ఇక్కడ చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. వెయ్యి మందికి పైగా డాక్టర్ రెండు వేల మందికి పైగా వైద్య సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: