దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు వైరస్ విజృంభిస్తూ ఉండటంతో శాస్త్రవేత్తలు ఇప్పటికే కనిపెట్టిన మందులను రోగులపై ప్రయోగిస్తున్నారు. అయితే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్.ఐ.వీ మందులు రోగులపై పెద్దగా ప్రభావం చూపటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 
 
ఈ మందులపై క్లినికల్ ట్రయల్స్ నిలిపివేయాలని భావిస్తోంది. ఈ మందులు కరోనా రోగుల మరణాల శాతాన్ని తగ్గించడంలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని తెలుస్తోంది. పలు సంస్థల నుంచి ఈ మందుల గురించి వెలువడిన ఫలితాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: