ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో అమ్మవారి దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. కూరగాయలు, పండ్ల రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.  ఇక ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని నిన్నటి వరకు 9500 మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో సురేష్‌ బాబు తెలిపారు. కూరగాయలు, పండ్లు రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను  భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. 

 

ఈ రోజు 8000 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మవారి దర్శనం కలిపిస్తున్నామన్నారు. భక్తులు నియమ నిబంధనల ప్రకారం సోషల్ డిస్టెన్స్ తో మాస్కులు ధరించి దర్శించుకున్నారని.. ఆలయం మొత్తం శానిటైజర్ చేశామని అన్నారు. అన్ని భద్రతలు తీసుకొని భక్తులకు దర్శనబాగ్యం కల్పించామని అన్నారు. శాకాంబరీ దేవిని  సిపి బత్తిన శ్రీనివాసులు దర్శించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: