పరుచూరి గోపాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా గత కొన్ని నెలల నుంచి అనుభవాలను, జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. నేడు గురు పౌర్ణమి సందర్భంగా ఆయన గతంలో బాపు గారి కార్టూన్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆ కార్టూన్ లో బాపుగారు ఒక పిల్లవాడు టీవీలో సినిమాలు చూస్తున్న వాళ్ల అమ్మను కవిత్రయం అంటే ఎవరు అని ప్రశ్నించగా పరుచూరివెంకటేశ్వరరావు, పరచూరి గోపాలకృష్ణ, త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పేర్కొన్నారు. 
 
బాపు గారు ఆ కార్టూన్ ను చమత్కారంతో నింపేశారు. పరుచూరి గోపాలకృష్ణ గురు పౌర్ణమి రోజున ఆ కార్టూన్ ను అన్న పరుచూరి వెంకటేశ్వరరావుకు ఎవరో పంపారని.... ఆ కార్టూన్ ఎప్పుడు ఏ పత్రికలో వచ్చిందో తెలియదని... తమను కవిత్రయంతో పోల్చినందుకు బాపు గారికి ధన్యవాద పూర్వక నమస్సులు అని పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: