దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సహకారంతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్మా బ్యాంకు ప్రారంభించారు. దీంతో కరోనా  వైరస్ నుంచి కోలుకున్న రోగులు అందరూ తమ ప్లాస్మా  దానం చేసేందుకు అర్హులు. ఢిల్లీలోని ఆసుపత్రులకు ప్లాస్మాను అందజేయడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశంగా ప్రారంభించబడింది. 

 

 ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి వైరస్ తీవ్రత తగ్గించేందుకు ఇది మెరుగైన ఉపాయం అనే చెప్పాలి. అయితే బీపీ శరీర ఉష్ణోగ్రత కూడా చెక్ చేసి ప్లాస్మా దానం చేయాలి అనుకునే వ్యక్తి  ఫిట్ గా ఉన్నాడని నిర్దారణ అయితేనే  ప్లాస్మాను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ప్లాస్మా  సేకరణకు రెండు గంటల సమయం పడుతుందని కానీ యంత్రం  సాయంతో అరగంట సమయం లో పూర్తి అవుతుందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: