ఈ మధ్య కాలంలో చైనాకు భారత్ వరుస షాకులు ఇస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ వాస్తవాధీన రేఖ దగ్గర యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేసింది. తాజాగా సైన్యం మరొక విభాగాన్ని మోహరించింది. భారత్ దగ్గర యుద్ధ విమానాలు ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-29 కూడా సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ ఒక డివిజన్ సైనికులు ఉంటారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఆర్మీ నాలుగు డివిజన్ల సైనికులను మోహరించింది. 
 
ఒక విభాగంలో 10 వేల మంది సైనికులు ఉంటారు. మే 5 నుంచి తూర్పు లడఖ్‌లో ఇండో-చైనా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య గత నెల 15న గల్వాన్ లోయ దగ్గర జరిగిన హింసాత్మక ఘర్షణలో కల్నల్ స్థాయి అధికారి సహా 20 మంది సైనికులు మరణించారు మారిన పరిస్థితుల నేపథ్యంలో భారత్ భారీగా బలగాలను మోహరిస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: