ఢిల్లీలో దీ ఎస్టేట్​లో కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాసముంటున్న బంగ్లాను బిజెపి రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ జాతీయ మీడియా కార్యదర్శి అనిల్​ బలూనికి కేటాయించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల అధికారి వెల్లడించారు. అనిల్​ బలూని వినతి మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
1997లో ప్రభుత్వం ఢిల్లీలో కేటాయించిన నివాస గృహాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని జులై 1న ప్రియాంకా గాంధీకి నోటీసులు జారీ చేసింది కేంద్రం. ప్రభుత్వానికి రూ. 3.46 లక్షలు బకాయి ఉన్నట్లు నోటీసులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ప్రియాంక ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్.

 


ఉత్తర్​ప్రదేశ్​లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు ప్రియాంక గాంధీ. రాష్ట్రంలో పెరుగుతున్న హత్యా నేరాలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందీలో ట్వీట్​ చేశారు. యూపీలో గత వారం రోజుల్లోనే 50కి పైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. నేర రహిత రాష్ట్రం అని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెబుతున్న మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని ధ్వజమెత్తారు ప్రియాంక. గణాంకాల ప్రకారం దేశంలోనే నేరాల్లో యూపీ టాప్​లో ఉందని ఓ గ్రాఫ్​ను ట్వీట్​కు జత చేశారు. జౌన్​పుర్లో మరో హత్య జరిగిందని తెలిపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: