దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ తాజాగా హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రైతు బజార్ లో కలకలం రేపుతోంది. రైతు బజార్ కు చెందిన ఒక కాంట్రాక్టర్ కు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడు రోజుల పాటు మార్కెట్ ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ లో శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 
 
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నగరంలోని అన్ని ఏరియాలలో కేసులు నమోదయ్యాయి. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత నగరంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, జనం గుమికూడే ప్రదేశాల నుంచి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత నెలలో భరత్ నగర్ మార్కెట్ లో కూరగాయలు అమ్మే ఒక వ్యక్తి కరోనా భారీన పడటంతో మార్కెట్ మూసివేసిన సంగతి తెలిసిందే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: