ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. రష్యాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్న కేసులు ఎక్కువగా ఉన్నాయని రష్యా ప్రభుత్వం చెబుతోంది. గత 24 గంటల్లో రష్యాలో 6,611 కొత్త కరోనా కేసులు నమోదు కాగా అందులో 1907 మందిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని సమాచారం. 
 
కొత్తగా నమోదైన కేసులతో రష్యాలో కరోనా బాధితుల సంఖ్య 6,87,862కు చేరుకోగా రష్యాలోని 85 ప్రాంతాల్లో తాజాగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,579 మంది డిశ్చార్జ్ కాగా 4,54,329 మంది ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు 10,296 మంది వైరస్ భారీన పడి రష్యాలో మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: