సిఎం జగన్ కు హైపవర్ కమిటీ ఇచ్చిన ఎల్జీ పాలీమర్స్ ప్రమాద నివేదికలో పలు కీలక విషయాలను  ప్రస్తావించింది. పాలిమర్స్ లో భద్రతా ప్రమాణాలు పాటించలేదు అని పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు అని పేర్కొంది. ఎం 6 ట్యాంక్ లో ఉన్న స్టీరిన్ గ్యాస్ లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ప్రమాదం  జరిగింది అని వివరించింది. 

 

అత్యవసర ప్రమాదాల సమయంలో పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు అని పేర్కొంది. కాసేపటి క్రితం సిఎం జగన్ తో ముగిసిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించింది. రీఫ్రిజిరేషన్  కూలింగ్ సిస్టం లో లోపాలు ఉన్నాయని నాలుగు వేల పేజీల నివేదికను సిఎం జగన్ కు అందించింది కమిటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: