భారత్ చైనా సరిహద్దుల్లో  తమ బలగాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కు వచ్చాయి అని చైనా సర్కార్ ప్రకటించింది. చైనా విదేశాంగ శాఖా మంత్రి తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరపడంతో  చైనా వెనక్కు తగ్గింది. మొత్తం నాలుగు ప్రాంతాల నుంచి చైనా బలగాలను ఉపసంహరించుకుంది అని వెల్లడించారు. 

 

గాల్వాన్  ప్రాంతం నుంచి చైనా పూర్తిగా వెనక్కు వెళ్ళిపోయింది. గాల్వాన్ లోయ వద్ద  ఉదయం చైనా ఆర్మీ కి సంబంధించిన వాహనాలు కనిపించాయి అని భావించినా సాయంత్రానికి చైనా వాటిని పూర్తిగా వెనక్కు తీసుకుంది. దీనితో రెండు దేశాల మధ్య కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. కాగా  సరిహద్దుల్లో మోడీ పర్యటన తర్వాత చైనా వైఖరి మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: