భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నా సరే భారత సైన్యం మాత్రం సరిహద్దుల్లో చేపట్టిన నిర్మాణాలను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. గాల్వాన్ నదిపై వంతెన సహా సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. తాజాగా దీనిపై బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారి బీ కిషన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

లడఖ్ లో  బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లేహ్ సమీపంలో 3 వంతెనలను నిర్మించిందని ఆయన చెప్పారు. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట నిర్ణీత సమయంలో నిర్మించామని ఆర్మీ ట్యాంకులను తరలించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని అన్నారు. మేము రికార్డు 3 నెలల్లో జాతీయ రహదారి 1 లో 397 వ కిలోమీటర్ వద్ద వద్ద వంతెనను నిర్మించామని అన్నారు. ఇది ఎలాంటి భారం అయినా మోస్తుందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: