దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు వైరస్ పేరు వింటే చాలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనాపై పోరులో కొబ్బరి నూనె సైతం ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ప్రకారం కొబ్బరి నూనె వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడగలదని.... రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు దీనికి ఉన్నాయని ఇది శరీరంలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థను సైతం మెరుగుపరచగలదని వాళ్లు చెబుతున్నారు. ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించే కేరళీయులు త్వరగా కరోనా నుంచి కోలుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: