ఈశాన్య రాష్ట్రాల్లో వరుస భూకంపాల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట భూకంపాలు సంభవిస్తున్నాయి. నాగాలాండ్ సహా మిజోరాం తో పాటుగా సిక్కిం అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో పదే పదే భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి భూకంపం సంభవించింది ఈశాన్య రాష్ట్రాల్లో. 

 

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున 1:33 గంటలకు రిక్టర్ స్కేల్ పై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.  ప్రజలు అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం రావడంతో  ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉండటం తో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: