క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అయిన యూఏఈలో క‌రోనా అక్క‌డ ప్ర‌జ‌ల‌ను క‌కావిక‌లం చేసేస్తోంది. క‌రోనా వ్యాప్తి ప్రారంభ‌మైన వెంట‌నే అక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేకుండా లాక్ డౌన్ అమ‌లు చేయ‌డంతో పాటు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు ఉన్నా ఇప్పుడు ఒక్క‌సారిగా క‌రోనా స్వైర‌విహారం చేస్తోంది.

 

సోమ‌వారం న‌మోదైన 528 కొత్త కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 52,068 మంది కోవిడ్ బారిన ప‌డ్డారు. అలాగే 424 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్ప‌టికే యూఏఈ వ్యాప్తంగా 324 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లిగొంది. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు చేస్తున్న యూఏఈ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 30ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: