టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కలవడానికి గానూ టీడీపీ నేతలు రాజమండ్రి సెంట్రల్ జైలు కి వెళ్ళగా వారిని అధికారులు అనుమతించలేదు. దీనిపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రవీంద్రను జైలులో పెట్టినప్పుడు అధికారులకు కరోనా గుర్తుకు రాలేదన్న ఆయన.. పరామర్శించడానికి వస్తే కరోనా అంటున్నారని విమర్శించారు. 

 

పథకం ప్రకారమే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఉమా మండిపడ్డారు. రవీంద్ర వ్యక్తిత్వం అందరికి తెలుసు అని అన్నారు. హత్య కేసులో ఏ4 గా కొల్లు రవీంద్ర పేరు పెట్టారని ఆయన విమర్శించారు. అసలు ప్రాధమిక విచారణ జరగలేదని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: