ఈ మద్య ఏపి రాజకీయాల్లో హడావుడి మొదలైంది.  టీడీపీ లీడర్లు వరుసగా అరెస్టులు అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తమ నేతలను కావాలనే అరెస్టులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇక చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారని అధికా పక్షం అంటున్నారు. ఏది ఏమైనా ఏపిలో కరోనా కష్టాలు ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. 

 

ప్రజలకు ఇచ్చిన హామీలు.. పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇటీవలే ఆధునిక సౌకర్యాలతో కూడిన 108, 104 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గంలో  108, 104 వాహనాలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా స్వయంగా ఓ 108 అంబులెన్స్ ను రోజా స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 

 

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, చంద్రబాబుపైనా, టీడీపీపైనా ధ్వజమెత్తారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు.. ఇది ప్రతిపక్షం వారికి అస్సలు నచ్చడం లేదని.. అందుకే అక్కసుతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.  మంచి పనులు చేస్తూ సీఎం జగన్ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంటుంటే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు తిన్నది అరక్క ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: