ఏపీలో కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల‌తో పాటు కొన్ని న‌గ‌రాల్లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిలా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో ఈ మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేసేందుకు మళ్లీ కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ త‌ప్ప‌క విధించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఇప్పటికే ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. అయితే ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ప‌రిస్థితులు తీవ్రంగా ఉండ‌డంతో ఆ ప్రాంతాల్లో అయినా లాక్ డౌన్ త‌ప్ప‌క విధించాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.

 

ఇప్ప‌టికే ఈ నెలాఖ‌రు వ‌ర‌కు నెల్లూరు జిల్లాలో లాక్‌డౌన్ కంటిన్యూ కానుంది. ఇక ఇప్పుడు తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో క‌రోనా కేసుల తీవ్ర‌త ఎక్కువుగా ఉన్న చోట్ల లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తూర్పు గోదావ‌రి జిల్లాలో అమ‌లాపురంతో పాటు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కేంద్ర‌మైన ఏలూరుతో పాటు క‌రోనా ఎక్కువుగా ఉన్న ఏడు మండ‌లాల్లో కఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: