ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ దేశంలోనూ, ప్ర‌పంచంలోనూ వ‌చ్చే ఐదారు నెల‌ల్లో మ‌రింత‌గా విజృంభించ‌నుందా ? అంటే అవున‌నే అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో క‌రోనాకు వ్యాక్సిన్ రాని ప‌క్షంలో మ‌రో ఐదారు నెల‌ల్లో క‌రోనా తీవ్రంగా విజృంభిస్తుంద‌ని తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌న దేశంలో ప‌దిహేను రోజుల క్రితం రోజుకు 10- 12 వేల మ‌ధ్య ఉన్న కొత్త కేసులు కాస్తా ఇప్పుడు ఏకంగా 25 వేల‌కు చేరువ‌లో ఉన్నాయి. ఈ లెక్క‌న చూస్తే నాలుగు రోజుల‌కే ల‌క్ష కొత్త కేసులు న‌మోదు అయినట్టు అవుతుంది.

 

మ‌రో దారుణం ఏంటంటే వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నాటికి దేశంలో రోజుకు 2.87 ల‌క్ష‌ల కేసుల‌ని నిపుణుల అంచ‌నా వేస్తున్నారు. ఇదే టైంలో ఫిబ్ర‌వ‌రి నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది క‌రోనాతో బాధ‌ప‌డుతుంటార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అదే జ‌రిగితే ప్ర‌పంచం అంతం దిశ‌గా ముందుకు వెళుతుంద‌నే చెప్పాలి. మ‌రి ఈ మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచం ఎలా కోలుకుంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: