భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 482 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభిస్తుంది. ఏపిలో మరి దారుణంగా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 1062 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. 

 

ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 22259కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 264 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 10,894 క‌రోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 11,101 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 27,643 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 1051 మందికి కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది.

 

ఏపీలో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కూ 10,77,733 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్ వల్ల క‌ర్నూలులో ముగ్గురు, అనంత‌పూర్‌లో ఇద్ద‌రు, కృష్ణ‌లో ఇద్ద‌రు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఇద్ద‌రు, చిత్తూరులో ఒక‌రు, గుంటూరులో ఒక‌రు, వైజాగ్‌లో ఒకరు మరణించారు

మరింత సమాచారం తెలుసుకోండి: