ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ జయంతి సందర్భంగా జులై 8వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు రైతు దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నేరుగా రైతుల ఖాతాలలోనే సున్నా వడ్డీలను జమ చేస్తామని అన్నారు. 57 లక్షల మంది రైతుల వడ్డీ బకాయిలను చెల్లిస్తున్నామని తెలిపారు. వడ్డీ లేని రుణాల పథకానికి టీడీపీ హయాంలో గ్రహణం పట్టిందని సీఎం తెలిపారు. 
 
గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు 1,150 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని తెలిపారు. వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని అన్నారు. కొంతమంది రైతులకు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నా నాలుగు రోజుల్లో అందరి ఖాతాలలో జమవుతుందని అవసరమైతే 1907 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: