దేశంలో ఇప్పుడు కరోనాతో చచ్చిపోతుంటే.. ప్రకృతి కూడా పగబట్టినట్టే ఉంది. భూకంపాలు, తుఫాన్లు, భారీ వర్షాలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా మన దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఓ వైపు కురుస్తుంటే.. మరోవైపు భూకంపాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం అసోంలోని తేజ్‌పూర్‌ ప్రాంతలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 2.7 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది.

 

ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా, బుధవారం తెల్లవారు జామున కశ్మీర్‌లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో వరుసగా భూకంపాలు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపాల వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు.. కానీ అక్కడక్కడా ఆస్తి నష్టం మాత్రం జరిగిందని అంటున్నారు.  ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదే సమయంలో 482 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: