తెలంగాణలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాపిస్తోంది. కొత్తగా 1,879 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 1,422 మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందినవాళ్లే. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 27,612 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది.  ఈ మద్య వరుసగా ప్రజా ప్రతినిధులకు కరోనా సోకుతున్న విషయం తెలిసిందే. దాంతో అక్కడి అధికారులు, గన్ మెన్ లు, డ్రైవర్లకు సోకుతుంది. దాంతో వారంతా అప్రమత్తంగా ఉంటున్నారు. తాజాగా తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. 

 

తాజాగా  పద్మారావు కి సంబంధించి ఓ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దాన్ని నమ్మవద్దని పద్మారావు స్పష్టం చేశారు. వాట్సాప్ లోనూ ఇతర, సామాజిక వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న ఆ క్లిప్పింగ్ లో నిజంలేదని, అది వట్టి ఫేక్ ఆడియో అని వివరించారు.

 

ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని వైరల్ చేయడం పరిపాటైందని.. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని, ఆరోగ్యంగా బాగానే ఉందని వెల్లడించారు. తన క్షేమం కోసం ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: